నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వివిధ శాఖల్లో 20వేలకు పైగా పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. గ్రూప్-1, గ్రూప్ 2, గ్రూప్ 3, డీఎస్సీ, పోలీస్ శాఖలతో సహా వివిధ శాఖల్లోని 20,010 ఖాళీల భర్తీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఏపీపీఎస్సీ, డీఎస్సీ ద్వారా ప్రత్యక్ష పద్ధతిలో ఖాళీల నియామకం జరుగనుంది. వివిధ శాఖలలో ప్రస్తుతం ఉన్న ఖాళీలు, అవసరాల దృష్ట్యా మెగా రిక్రూట్మెంట్కు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.













