ఏపీ డిప్యూటీ సీఎంకు కరోనా పాజిటివ్

ఆంధప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వైరస్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా కరోనా సోకినట్లు తేలింది. విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. పుష్ప శ్రీవాణి విజయనగరం జిల్లా కుపారం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె భర్త, వైఎస్సార్‍సీపీ అరకు పార్లమెంట్ అధ్యక్షుడు పరిక్షిత్ రాజుకు కూడా కరోనా సోకింది. అతను కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.