సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (12వ తేదీ మధ్యాహ్నం) ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీతో ఆయన భేటీ కానున్నారు. ప్రధానంగా మూడు రాజధానులు, మండలి రద్దు అంశాలపై ప్రధానితో ముఖ్యమంత్రి చర్చించే అవకాశముంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే మండలి రద్దు ప్రవేశపెట్టేలా మోదీకి జగన్ విజ్ఞప్తి చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలు, పోలవరం నిధులపైనా ప్రధాని దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లే అవకాశం ఉంది. అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు మరి కొంతమంది కేంద్ర మంత్రులతోనూ జగన్ సమావేశం కానున్నట్లు తెలుస్తుంది. రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ ముగిసిన వెంటనే ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి ఢిల్లీ కి వెళ్లనున్నారు.













