ప్రధాని మోదీతో జగన్ భేటీ
రాష్ట్ర ప్రయోజనాలే ప్రాతిపదికగా గంటన్నరపాటు సాగిన సమావేశం
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ప్రాజెక్టులకు నిధులు, విభజన హామీల సాధనే ఎజెండాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఫిబ్రవరి 12వ తేదీన న్యూ ఢిల్లీ లో సమావేశమై చర్చించారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ అంశాలపై కూడా ప్రధానితో సీఎం మాట్లాడినట్లు తెలిసింది. ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు డిమాండ్ల సాధన కోసం సీఎం జగన్ ఇటీవలే ప్రధాని మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా తాను లేఖలో పేర్కొన్న అంశాలను ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అసమానతలను తొలగించి, సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పరిపాలన వికేంద్రీకరణకు చర్యలు చేపట్టామని ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలియజేశారు. మోదీకి దుశ్శాలువా కప్పి.. పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా 11 అంశాలతో కూడిన వినతి పత్రంను కూడా సమర్పించారు.
ఈ ఏడాది మార్చి 25న ఉగాది రోజున 25 లక్షలు కుటుంబాలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేపడుతున్నామని, ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ప్రధానమంత్రి మోదీని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఆహ్వానించారు. నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా దీన్ని చేపట్టినట్లు సీఎం తెలిపారు. అలాగే తూర్పు గోదావరి జిల్లాలో 800 ఎకరాల ఉప్పు భూములను ఇళ్ల స్ధలాలు కోసం ఇవ్వాల్సిందిగా ప్రధానిని కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాల్సిందిగా సంబంధిత కేంద్ర మంత్రిత్వశాఖలను ఆదేశించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
పోలవరం ప్రాజెక్ట్‌కు సవరించిన అంచనాలు రూ. 55,549 కోట్లకు పరిపాలనా పరమైన అనుమతులకు ఆమోదం తెలిపేలా చర్యలు తీసుకోవాలని, ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.3320 కోట్లును విడుదల చేసేలా జల వనరుల శాఖను ఆదేశించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, హోదా ఇవ్వడానికి ఆర్థిక సంఘం సిఫార్సుతో అవసరం లేదని, ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వీలైనంత త్వరగా వీటికి ఆమోదం తెలపాలని ప్రధాని మోదీని కోరారు. ప్రత్యేక హోదా అన్నది కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిదని, తగిన నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వమే తీసుకోవచ్చంటూ 15వ ఆర్థిక సంఘం స్పష్టంచేసిన అంశాన్ని ప్రధానికి నివేదించారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, రూ.22948.76 కోట్లు రెవెన్యూ లోటుగా కాగ్ అంచనా వేసిందని, ఇంకా రూ.18969.26 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందని, వీలైనంత త్వరగా ఈ మొత్తాన్ని ఇప్పించాలనిన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.10,610 కోట్లు మాత్రమే వచ్చాయని, గత ప్రభుత్వంలో ఏ ఏడాదితో పోల్చినా ఈ మొత్తం తక్కువే అని ప్రధాని దృష్టికి తెచ్చారు. పెండింగ్‌లో ఉన్న గ్రాంట్స్‌ను విడుదల చేయాల్సిందిగా కేంద్ర ఆర్ధికశాఖను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. కడప స్టీల్ ప్లాంటు నిర్మాణానికి సత్వర చర్యలు తీసుకోవాలని, రామాయపట్నం పోర్టు నిర్మాణానికి నిధులివ్వాలని విన్నవిస్తూ, కృష్ణా-గోదావరి నదులు అనుసంధానానికి నిధులు విడుదల చేయాని ప్రధానిని సీఎం జగన్ కోరారు.
రాజధాని నిర్మాణానికి రూ.2500 కోట్లు కేటాయిస్తే… కేవం రూ.1000 కోట్లు మాత్రమే విడుదల చేశారని, మిగిలిన నిధులనూ వెంటనే విడుదయ్యేలా చూడాన్నారు. గడిచిన ఆరేళ్లలో 7 జిల్లాకు కేవలం రూ.1050 కోట్లు మాత్రమే ఇచ్చారని, గడిచిన మూడేళ్ల నుంచి కేటాయింపులు కూడా లేవని, రూ.2,100 కోట్లకు గాను కేవలం రూ.1050 కోట్లు మాత్రమే విడుదల చేశారని, వెనుకబడిన జిల్లాకు బుందేల్‌ఖండ్, కహండి నమూనాలో నిధులివ్వాన్నారు. అక్కడ ఒక వ్యక్తికి తసరి రూ.4000 ఇస్తే, ఇక్కడ రూ.400 మాత్రమే ఇస్తున్నారని ప్రధానికి తెలిపారు.
మోదీ కేబినెట్లో వైసిపి?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈసారి జరిపిన ఢిల్లీ పర్యటన ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. కేంద్ర కేబినెట్లో వైసీపీ చేరనున్నట్లు అందుకోసమే ప్రధాని నరేంద్రమోదీ జగన్‌కు అపాయింట్మెంట్ ఇచ్చినట్లు వార్తలు షికారు చేశాయి. ప్రధానితో గంటకు పైగా జరిగిన సమావేశంలో ఎన్డీఏ కూటమిలో వైసీపీ చేరికపై వీరిద్దరూ చర్చించినట్లు వార్తలు వచ్చాయి. వైసీపీకి ప్రధాని మోడీ రెండు కేబినెట్ సీట్లు ఆఫర్ చేశారని తెలుస్తోంది. రాజ్యసభ కోటాలో విజయసాయిరెడ్డి, లోక్ సభ కోటాలో నందిగం సురేష్ లు కేంద్ర మంత్రులయ్యే చాన్స్ ఉందని వార్త. మరోవైపు ఎన్డీఏలో తాము భాగస్వాముం కావడం లేదంటూ విజయసాయిరెడ్డి ఆ ప్రచారాన్ని ఖండించారు. మోదీ కేబినెట్లో వైసీపి చేరనున్నదా లేదా అన్న విషయం తేలాంటే వేచి చూడాల్సిందే.













