ధర్మపోరాట దీక్షకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
ఢిల్లీలో ఫిబ్రవరి 11న నిర్వహించే ధర్మపోరాట దీక్షకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దీనికి సంబంధించి రెండు ప్రత్యేక రైళ్లను విజయవాడ నుంచి ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఇందులో పలు కీలక అంశాలను చర్చించారు. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారం వంటి అంశాలను ప్రస్తావించారు. ఫిబ్రవరి నెలాఖరు కల్లా అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాల్సి ఉందని చంద్రబాబు అన్నారు.













