వచ్చే ఎన్నికల్లో 175కి… 175 సాధించాలి : వైఎస్ జగన్
రానున్న ఎన్నికల్లో 175 సీట్లు సాధించడమే మన లక్ష్యమని, ఇది కష్టం కాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రులు, వైసీపీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జులతో నిర్వహించిన వర్క్ షాప్ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాలు సాధించాలన్నారు. కుప్పంలో మున్సిపాలిటీ గెలుస్తామనుకున్నామా? ఎంపీటీసీలు, జడ్పీటీసీలను క్లీన్ స్వీప్ చేస్తామనుకున్నామా? అని ప్రశ్నించారు. కష్టపడితే రానున్న ఎన్నికల్లో 175సీట్లు సాధించగలుగుతాం. గడప గడపకు మన ప్రభుత్వం నిరంతర కార్యక్రమం, 8 నెలలు పాటు ఇది కొనసాగుతుందన్నారు. ఒక్కో సచివాలయం పరిదిలో రెండు రోజులు దీనికి కేటాయించాలి. నెలలో ఒక్కో సచివాలయంలో రెండేసి రోజుల చొప్పున 10 సచివాలయాల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలి. ఇకపై నెలకు ఒకసారి వర్క్‌షాప్ నిర్వహిస్తామన్నారు. మనకు వచ్చన స్పందనపై వర్క్‌షాప్‌లో చర్చిస్తామన్నారు. నేతల నుంచి సలహాలు, సూచనలు తీసుకుని వాటిపై చర్చిస్తాం అన్నారు.













