పశ్చిమ బెంగాల్ సంఘటనలను అందరూ ఖండించాలి: చంద్రబాబు
మమతా బెనర్జీకి సంఘీభావంగా ఉండాలి. కోల్ కత్తా ర్యాలీ విజయవంతం అయ్యింది. అందుకే మమతా బెనర్జీపై మోది కక్ష సాధింపు. బిజెపికి లొంగిపోయిన వారిపై కేసులు ఎత్తివేత. బిజెపిని ఎదిరిస్తే పాతకేసులు బైటకు తీస్తున్నారు. మొన్న అఖిలేష్,మాయావతిపై కేసులు. ఇప్పుడు మమతా బెనర్జీపై కక్ష సాధింపు. రాష్ట్రాల అధికారాలను హరించేందుకు మోది కుట్రలు. కేంద్ర,రాష్ట్ర సంబంధాలను పూర్తిగా దిగజారుస్తున్నారు.
ప్రతిపక్ష నేతలు అందరిపై కేసులుపెట్టి బిజెపి ఆనందం. సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారు. రాజ్యాంగ వ్యవస్థలను పతనం చేస్తున్నారు. శాంతిభద్రతలు రాష్ట్ర పరిధిలో అంశం. కోడికత్తి కేసు ఎన్ ఐఏ కు అప్పగించడం బిజెపి కుట్ర. టీమ్ ఇండియా అన్నారు, ఫెడరల్ ఇండియా అన్నారు. ఆకర్షణీయ నినాదాలే తప్ప ఆచరణ శూన్యం. సిబిఐ,ఆర్ బిఐ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీశారు. ఈడి,ఐటి లను దుర్వినియోగం చేస్తున్నారు. బిజెపి నిరంకుశ పోకడలను అందరూ ఖండించాలి. అన్నిపార్టీలను సమన్వయం చేస్తున్నాం. జాతీయపార్టీల నేతలతో మాట్లాడుతున్నాం. ఈ రోజు ఢిల్లీ పర్యటనలో కూడా దీనిపైనే చర్చిస్తాం. దేశస్థాయిలో ఉద్యమానికి యాక్షన్ ప్లాన్. తిత్లి తుపాన్ కు శ్రీకాకుళం విధ్వంసమైతే అమిత్ షా రాలేదు: ముఖ్యమంత్రి చంద్రబాబు
4 నెలల తరువాత వచ్చి ఏం చూద్దామని, ఏం చేద్దామని..? ఏ ముఖం పెట్టుకుని ఇప్పుడొస్తున్నారు..? ప్రజల నిరసనల తీవ్రతను మోది, షా లు ఎదుర్కోక తప్పదు.













