విభజన హామీలు సాధించేవరకు పోరాటం : చంద్రబాబు
హైదరాబాద్‌ను వదిలేసి కొత్త జీవితాన్ని ప్రారంభించామని, అన్ని రాష్ట్రాలతో సమానంగా ఏపీ అభివృద్ధి చెందాలంటే.. కేంద్రం సహకరిస్తే 20-30 ఏళ్లు పడుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం దుర్మార్గంగా ప్రవర్తించిందని అన్నారు. మోదీ ఏపీ ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారని ఇది మంచిది కాదన్నారు. రాష్ట్ర ప్రజల కోసమే ఢిల్లీ వీధుల్లో పాదయాత్ర చేపట్టినట్లు సృష్టం చేశారు. ఇప్పటికైనా మోదీ, కేంద్రం స్పందించకుంటే తీవ్ర పరిణామలు ఉంటాయని హెచ్చరించారు. విభజన హామీలు సాధించేవరకు తమ పోరాటం ఆగదని సృష్టం చేశారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ కేసుల మాఫీ కోసం మోదీకి ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. మోదీ ప్రభుత్వం మమ్మల్ని నమ్మించి మోసం చేసిందన్నారు. మోదీ ప్రభుత్వాన్ని ప్రజాకోర్టులో శిక్షతప్పదని హెచ్చరించారు. వైసీపీ, బీజేపీతో కలిసిపనిచేయడాన్ని ప్రజలు చీదరించుకుంటున్నారన్నారు. తాను చేస్తోంది రాజకీయ ప్రయోజనాల కోసం కాదని ప్రజా ప్రయోజనాల కోసమే పోరాడుతున్నామని పేర్కొన్నారు.













