ప్రత్యర్ధుల నేరచరిత్ర గుర్తుంచుకోవాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు
హత్యలు, దోపిడిలు, దాడులు ప్రత్యర్ధుల సంస్కృతి. ఆధిక్యం కోసం దేనికైనా దిగజారే పార్టీ వైసిపి. వాళ్లే సీన్ క్రియేట్ చేస్తారు. వాళ్లే దుష్ప్రచారం చేస్తారు. ఫొటోలు మార్పింగ్ చేస్తారు. వీడియో కటింగ్ లు చేస్తారు. ప్రతిపక్షం తప్పుడు పనులను సమర్ధంగా ఎదుర్కోవాలి. నేరస్థుల ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. నేరస్థులతో పోరాటంలో మరింత అప్రమత్తత కావాలి. ఈ ఎన్నికల్లో మనం పోటిబడేది నేరస్థులతో చేయని తప్పులు మనపై రుద్దుతారు.
తప్పులు జరిగేలా స్కెచ్ లు వాళ్లే వేస్తారు. ఒక కన్ను ఎప్పుడూ ప్రతిపక్షంపై ఉండాలి. రాజధానిలో రూ.లక్ష కోట్ల అవినీతి అని దుష్ప్రచారం వెంటనే నేను ఖండిస్తే వెనక్కి పోయారు. భూములు రైతుల వద్దే ఉంటే అవినీతికి చోటెక్కడ..? రాజధానికి భూములు ఇవ్వకుండా రెచ్చగొట్టారు. రైతులు వినకపోతే విధ్వంసాలకు తెగపడ్డారు. అరటితోటల ధ్వంసం, చెరకు తోటలు తగులపెట్టారు. రైతుల పొలాల్లో బోర్లు ధ్వంసం చేశారు. రాజధానికి, పోలవరంకు వ్యతిరేకంగా అనేక కేసులు వేశారు. గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి సుప్రీంకోర్టు దాకా కేసులు. రాజకీయాల్లో నేరగాళ్లను తెచ్చిన పార్టీ వైసిపి. నేరమయ రాజకీయాలకు చిరునామా జగన్ కుటుంబం. మోది, షా, కెసిఆర్, జగన్ కుమ్మక్కై కుతంత్రాలు. నలుగురి కుట్రలను ధైర్యంగా ఎదుర్కోవాలి. మోది,కెసిఆర్ అధికార దుర్వినియోగం. సామాన్యుల్లో భయం పెంచుతున్నారు. ఓటమి భయంతోనే వైసిపి కుట్రల మీద కుట్రలు. ఓటమి భయంతోనే కులాల మధ్య చిచ్చు. వీటన్నింటినీ తిప్పికొట్టాలి, ప్రజలకు వివరించాలి. ధైర్యంగా మనం ఎదుర్కొంటేనే ప్రజల్లో విశ్వాసం.













