ఎవరెస్టు అధిరోహకులకు సీఎం చంద్రబాబు అభినందనలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నలుగురు విద్యార్థులు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. ఎవరెస్టు అధిరోహించిన వారిలో విజయనగరం జిల్లా భద్రగిరిలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో సీనియర్ ఇంటర్ చదువుతున్న బొడ్ల సాగర్, శ్రీశైలంలోని గిరిజన సంక్షేమ పాఠశాలలో సీనియర్ ఇంటర్ చదువుతున్న శీలం ఈశ్వరయ్య, యువజన సంక్షేమ విభాగం నుంచి ధర్మతేజ, చెన్నారావు ఉన్నారు. వీరు బీజింగ్ కాలమానం ప్రకారం ఈరోజు ఉదయం 6:15 గంటలకు ఎవరెస్టు శిఖరాగాన్ని చేరుకున్నారు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన విద్యార్థులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభినందనలు తెలిపారు. సృష్టమైన లక్ష్యం, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారంటూ వారిని ప్రశంసించారు.













