10న ఏపీ రాష్ట్ర బడ్జెట్ ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2019-20 ఆర్థిక సంవత్సరం పూర్తి స్థాయి బడ్జెట్ రూపకల్పనకు కసరత్తు సాగుతోంది. జులై రెండో వారంలో రాష్ట్ర శాసనసభలో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఆస్కారం ఉందని తెలిసింది. ప్రస్తుత సమాచారం ప్రకారం జులై 10న శాసనసభకు బడ్జెట్ సమర్పించే అవకాశం ఉంది. పరిస్థితులను బట్టి ఈ తేదీ మారే అవకాశమూ ఉంది. ఇప్పటికే ఎన్నికలకు ముందు నాటి ప్రభుత్వం రూ.2.26 లక్షల కోట్లతో పూర్తిస్థాయి బడ్జెట్ను తయారు చేసి సభకు సమర్పించినా నాలుగు నెలలు కాలానికే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదం పొందింది. ప్రస్తుతం జులై నెలాఖరులోగా పూర్తిస్థాయి బడ్జెట్ ఆమోదం పొందవలసి ఉంది. ప్రభుత్వం మారడం, ప్రాధాన్యాలు మారిన నేపథ్యంలో బడ్జెట్ స్వరూపమే మారిపోనుంది.













