ఏసీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ వర్షాకాల శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఏడు రోజుల పాటు ఈ సమవేశాలు జరగనున్నాయి. ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశానికి ముందు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం జరిగింది. మరోవైపు బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. అసెంబ్లీ లీకుల మయంగా ఉందని, చిన్నపాటి వర్షానికే నీళ్లు వచ్చిన చేరుతున్నాయంటూ నిరసన తెలిపారు. అందుకే ముందు జాగ్రత్తగా గొడుగులు, రెయిన్కోట్లతో వచ్చామని ఎద్దేవా చేశారు. రూ.1000 కోట్ల ప్రజాధనం వృథా అని ప్లకార్డులు ప్రదర్శించారు.













