ఏపీలో అన్న క్యాంటీన్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు, విలేజ్ మాల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. 50వేల జనాభాకు ఒకటి చొప్పున రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రతిపాటి పుల్లారావు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వీటిని పురపాలక, పౌరసరఫరాల శాఖ మసన్వయంతో ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో మొత్తం 13 జిల్లాలో విలేజ్ మాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీటి ద్వారా 20 శాతం తక్కువకే నిత్యావసరాలు అందించనున్నట్లు తెలిపారు. మండలానికి ఒక రైతు బజార్ చొప్పున ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తామన్నారు.













