ఏపీటీఎఫ్ కీలక నిర్ణయం… సెప్టెంబర్ 5ను
ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఉపాధ్యాయ దినోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు సెప్టెంబర్ 5న ప్రభుత్వ సత్కారాలు, సన్మానాలు తిరస్కరణకు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) పిలుపునిచ్చింది. ఉపాధ్యాయులను ప్రభుత్వం అవమానిస్తోందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. అక్రమ నిర్బంధాలు, బైండోవర్లను తీవ్రంగా పరిగణిస్తున్నాం. సొంత ఫోన్లలో ఫొటోలతో హాజరు వేసేలా ఒత్తిడి చేస్తున్నారు. సీపీఎస్ రద్దు హామీని ప్రశ్నిస్తే ఆక్రమ కేసులు బనాయిస్తున్నారు అని పలు ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై మండిపడ్డాయి.













