ఏపీలో కరోనా విలయం.. ఒక్కరోజులో

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 72,979 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 15,284 మందికి పాజిటివ్‍గా తెలింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 16,09,105కి చేరింది. తాజాగా మరో 106 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 10,328కి పెరిగింది. తాజాగా 20,917 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం రాష్ట్రంలో 1,98,023 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 1,87,49,201 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
కొత్తగా చిత్తూరు జిల్లాలో 15 మంది, ప్రకాశం జిల్లాలో 11, పశ్చిమ గోదావరి జిల్లాలో 10 మంది మృతి చెందారు. అనంతపురం, తూర్పుగోదావరి, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో 9 మంది చొప్పున చనిపోయారు. కర్నూలు, విజయనగరం జిల్లాల్లో 8 మంది చొప్పున మృతి చెందగా, శ్రీకాకుళం జిల్లాల్లో 7, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున కన్నుమూశారు. కడప జిల్లాలో కరోనాతో ఒకరు మృతి చెందారు.