ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 84,502 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 14,429 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అలాగే, 103 మంది కరోనాతో మృతి చెందారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 20,746 మంది డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటి వరకు 14,66,990 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,90,09,047 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనాతో ఇప్పటి వరకు 10,634 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,80,362 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కొత్తగా చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 15 మంది చొప్పున మృతి చెందారు. విశాఖలో 10 మంది, నెల్లూరు జిల్లాలో 9 మంది మృతి చెందారు. అనంతపురం, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో 8 మంది చొప్పున మృతి చెందారు. గుంటూరు, విజయనగరం జిల్లాల్లో ఏడుగురు చొప్పున మృతి చెందారు. శ్రీకాకుళం 6, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు మృతి చెందారు. కడప, కర్నూలు జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందారు.