Andhra MP’s silence in Parliament: పార్లమెంట్ లో కూటమి మౌనం.. అసలు కారణం అదేనా?
ప్రస్తుతం పార్లమెంట్లో శీతాకాల సమావేశాలు (Parliament Winter Session) జరుగుతున్నాయి.. ఈ నేపథ్యంలో కూటమి తరఫున ఎంపీలు తమ గళాన్ని వినిపిస్తారు అని అందరూ భావించారు. ఇటు చంద్రబాబు ( Chandra Babu ) కూడా టిడిపి ఎంపీలకు కొన్ని కీలక బాధ్యతలు అప్పగించినట్లు ప్రచారం జరిగింది. ఇటు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా పార్లమెంట్లో తమ తరఫున రెస్పాండ్ అవ్వాల్సిన అంశాల గురించి తన ఇద్దరు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.
ఇక ఈసారి పార్లమెంట్ సమావేశాలలో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా ఉన్న అదానీ-జగన్ (Adani -Jagan) విషయంపై తీవ్రంగా కూటమి ఎంపీలు చర్చిస్తారు అని అందరూ భావించారు. అంతేకాదు రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలు.. ఇవ్వవలసిన ఉపాధి హామీలు.. గ్రామీణ అభివృద్ధి లాంటి అంశాలను కూడా లేవనెత్తుతారని అనుకున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధికి ఎంత ప్రిఫరెన్సెస్ ఇస్తున్నారో అందరికీ తెలుసు.. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా జనసేన ఎంపీలు ఈ విషయంపై పార్లమెంట్లో చర్చిస్తారు అని ఆశించిన అందరికీ వారి మౌనం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే లోక్సభలో కూటమి ఎంపీల గొంతు అస్సలు వినిపించడం లేదు. బీజేపీ తరఫున ప్రస్తుతం ఆరుగురు ఎంపీలు ఉన్నప్పటికీ వారు కేంద్రం ఏం చెబితే అది చేస్తారు కాబట్టి వారి నుంచి పెద్దగా ఆశించాల్సిందే లేదు. మరోపక్క వైసీపీ నుంచి ఉన్న నలుగురు ఎంపీలు ఎందుకు సైలెంట్ గా ఉన్నారో ఎవరికి అర్థం కావడం లేదు.
సమయం దొరికినప్పుడల్లా జగన్ పై ఏదో ఒకటి మాట్లాడి.. ఐదు సంవత్సరాల అరాచక పాలనా గురించి కూటమి నేతలు చర్చిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం అదానీ-జగన్ వ్యవహారంలో మాత్రం నోరు మెదపడం లేదు. దీనికి ముఖ్య కారణం బీజేపీ కి అదానీ ప్రీతిపాత్రుడు కావడం అని కొందరు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం సభలు సజావుగా సాగడం లేదు.. అలా ప్రారంభిస్తున్నారో లేదో ఇలా పది నిమిషాలలో సభ వాయిదా పడుతుంది. ఈ నేపథ్యంలో మన ఎంపీలు గళం విప్పక పోవడానికి ఇది కూడా ఒక కారణమని ప్రచారం జరుగుతుంది.













