జీఎస్టీ బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదముద్ర వేసింది. ఈ రోజు ప్రత్యేకంగా సమావేశమైన శాసనసభలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బీఎస్టీ బిల్లును ప్రవేశపెట్టారు. పలువురి సభ్యులు తమ అభిప్రాయాలు తెలిపిన తర్వాత బిల్లు ఆమోదించారు. అయితే ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలు రైతుల ఆత్మహత్యలపై అసెంబ్లీలో చర్చించాలని కోరుతూ వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. ప్రత్యేక సమావేశాల్లో వేరే అంశాలపై చర్చించడం కుదరదంటూ స్పీకర్ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. అలాగే ప్రజా సేవల చట్ట సవరణ బిల్లుకు కూడా అసెంబ్లీ ఆమోదం తెలిపి నిరవధికంగా వాయిదా పడింది. బిల్లు ఆమోదం పొందేందుకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ధన్యవాదాలు తెలిపారు.













