బ్లాక్ చైన్ క్యాపిటల్ గా ఏపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రాన్ని బ్లాక్ చైన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని అన్నారు. కోవలెంట్ ఫండ్ ప్రతినిధులతో సచివాలయంలో ఏర్పాటు చేసిన రియల్ టైం గవర్నెన్స్ సెంటర్కు తీసుకొని వెళ్లిన లోకేష్ రాష్ట్రంలో అమలు చేస్తున్న రియల్ టైం గవర్నెన్స్ గురించి వివరించారు. కాగా, బ్లాక్ చైన టెక్నాలజీ అభివృద్ధికి లోకేష్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ, కోవలెంట్ ఫండ్ మధ్య ఒప్పందం కుదిరింది. విశాఖపట్నంలో బ్లాక్ చైన్ టెక్నాలజీ బిజినెస్ కాన్ఫరెన్స్ నిర్వహించామని, బ్లాక్ చైన్ టెక్నాలజీలో రాష్ట్ర యువతి యువకులు ఉద్యోగాలు సాధించేందుకు హ్యాకథాన్స్ నిర్వహిస్తున్నామన్నారు.













