సమ్మె విరమించిన ఏపీ జూనియర్ డాక్టర్లు

ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్లు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూనియర్ డాక్టర్లతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరిపింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి చర్చలు జరిపారు. ఈ చర్చల నేపథ్యంలో జూనియర్ డాక్టర్ల డిమాండ్ పరిష్కారానికి ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో సమ్మె విరమిస్తున్నట్లు వైద్యులు ప్రకటించారు. ఆర్థిక భరోసా కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, 15 శాతం మేర స్టైఫండ్ పెంచాలని తాము కోరామని, మరింత ఎక్కువే స్టైఫండ్ పెంచే ఆలోచన తమకు ఉందని ప్రభుత్వం వెల్లడించిందని జూనియర్ డాక్టర్లు పేర్కొన్నారు.