ఆంధ్ర బిడ్డగా భావించండి : అనంత్ అంబానీ
రాయలసీమ ఉద్యానహబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ( ఐఎస్ఏ)లో రిలయన్స్ భాగస్వామ్యం కావడం గర్వంగా ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత అంబానీ (Anant Ambani) అన్నారు.అన్నమయ్య జిల్లా మదనపల్లె లో ఉద్యాన హబ్, ఐఏఎస్ఏ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనంత్ అంబానీ మాట్లాడుతూ ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో భాగస్వామ్యం కల్పించి రిలయన్స్ పై నమ్మకం ఉంచినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ( Chandrababu)కు ధన్యవాదాలు తెలిపారు. ఐఏఎస్ఏ కు తమ సంస్థ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. తనను ఆంధ్ర బిడ్డగా భావించాలని, రాష్ట్రానికి అందించాల్సిన సహకారంపై మార్గనిర్దేశం చేయాలని సీఎం చంద్రబాబును అనంత్ అంబానీ కోరారు. ప్రసంగం అనంతరం ఆయన్ను నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman), చంద్రబాబు అభినందించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి లోకేశ్(Minister Lokesh) తదితరులు హాజరయ్యారు.








