వైఎస్ ఆర్ లో చేరిన మాజీ మంత్రి
నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన అనుచరులతోపాటు నెల్లూరు నుంచి ఆ జిల్లా వైఎస్ఆర్ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్‌రెడ్డిని వెంటపెట్టుకుని పాదయాత్ర జరుగుతున్న విశాఖ జిల్లాలోని చోడవరం ప్రాంతానికి వచ్చారు. ఆనం, ఆయన అనుచరులకు జగన్ పార్టీ కండువా కప్పి సాదరణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారన్నారు. పాదయాత్రలో జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతుండటాన్ని చూసి ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానన్నారు.













