ఆ ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తామో.. ఇప్పుడే చెప్పలేం
పోలవరం ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తామో ఇప్పుడే చెప్పలేమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తామని మాత్రం చెప్పగలమన్నారు. విభజన చట్టంలో పోలవరాన్ని తామే కడతామని కేంద్ర ప్రభుత్వం చెబితే, ఎందుకు మేమే కడతామని తీసుకున్నారు అని ప్రశ్నించారు. 2019 నాటికి పోలవరం 48.39 శాతం మాత్రమే పూరైంది. నాకు ప్రాజెక్టుల గురించి తెలియదు కానీ, తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నా. 41.15 శాతం అనేది ప్రాజెక్టులో మొదటి దశ, మిగితాది తదుపరి దశ, ప్రస్తుతం మొదటి దశకు మాత్రమే కేంద్రం నిధులు మంజూరు చేసింది. ఆర్ అండ్ ఆర్, భూ సేకరణ అంతా కేంద్రం భరించాల్సిందే. ప్రాజెక్టులో క్రిటికల్ పనులన్నీ వైసీపీ ప్రభుత్వం చేసినవే. దెబ్బతిన్న డయాఫ్రం వాల్ స్థానంలో కొత్తది కట్టాల్సిందే అని అన్నారు.













