ఆకట్టుకునేలా..అమరావతి ఐకాన్
చార్మినార్ ఒకప్పుడు హైదరాబాద్ నగర శివార్లులో ఉండేది. పర్యాటకం పెరగడంతో ఊరు కూడా విస్తరించి నేడు నడిబొడ్డు ప్రాంతంగా మారింది. అమరావతి రాజధానికి ఇప్పటి వరకు ఎలాంటి ఐకాన్ లేదు. ప్రస్తుతానికి అమరావతిలో ఉన్న భారీ ధాన్యబుద్ద ప్రతిమ భవిష్యత్తులో ఐకాన్‌గా మారుతుందని అంతా భావిస్తోన్నారు. ప్రభుత్వం మాత్రం వేరొక ఆలోచన చేస్తోంది. హైదరాబాద్‌కు చార్మినార్ ఏ విధంగా అయితే గుర్తింపు తెచ్చిందో అమరావతికి కూడా విశిష్టత తీసుకొచ్చే కట్టడాన్ని నిర్మించాలని తలపిస్తోంది. సింగపూర్ ప్రభుత్వం ఇచ్చిన సీఆర్డీఏ మాస్టర్ క్యాపిటల్ సిటీ, సీడ్ క్యాపిటల్ ప్రణాళికల్లో ప్రధానంగా గేట్‌వేని ఐకాన్‌గా చూపించింది. కృష్ణానదిపై నిర్మించబోయే బ్రిడ్జి అమరావతికి ఐకాన్‌గా నిలస్తుందని అభిప్రాయపడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం వేరొక కట్టడాన్ని నిర్మించాలన్న ఆలోచన చేస్తున్నారు. అమరావతి నగర సందర్శ నకు వచ్చిన ప్రతీ ఒక్కరూ ఆ కట్టడాన్ని సందర్శించేలా కొన్ని ప్రత్యేకతలతో నిర్మించాలని భావిస్తున్నారు. రాజధాని నగర పరిధిలోనే ఐకాన్ నిర్మిస్తారని అధికారవర్గాలు చెబుతున్నాయి. అమరావతి ఐకాన్ బౌద్ధంతోనే పోలి ఉంటుందన్న చర్చలు రాజధాని ప్రాంతంలో సాగుతున్నాయి. ఐకాన్ ఆరాకంపై త్వరలోనే ప్రభుత్వం నుంచి సృష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ ఐకాన్ శతాబ్ధాల తరబడి ప్రముఖ పర్యాటక ప్రదేశంగా నిలిచిపోతుందని పేర్కొంటున్నారు.













