Union Budget :కేంద్ర బడ్జెట్లో.. ఏపీకి కేటాయింపులివే!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) 2025-26 కేంద్ర బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. పోలవరం(Polavaram) ప్రాజెక్టుతో పాటు, విశాఖ స్టీల్ ప్లాంట్(Steel Plant), విశాఖ పోర్టు (Port) కు నిధులు కేటాయించారు. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కేటాయింపులు ఇలా ఉన్నాయి.
పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు. పోలవరం నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంటుగా రూ.12,157 కోట్లు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.3,295 కోట్లు. విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు. రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి రూ.162 కోట్లు. రాష్ట్రంలో జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌కు రూ.186 కోట్లు. లెర్నింగ్ ట్రాన్స్ఫార్మేషన్ ఆపరేషన్‌కు మద్దతుగా రూ.375 కోట్లు. రాష్ట్రంలో రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ.240 కోట్లు. ఏపీ ఇరిగేషన్ (Irrigation), లైవ్లీ హుడ్ ఇంఫ్రూవ్‌మెంట్ ప్రాజెక్టు రెండో దశకు రూ.242.50 కోట్లు కేటాయిస్తున్నట్టు బడ్జెట్లో కేంద్రమంత్రి ప్రకటించారు.













