Akhil6: ఏప్రిల్ 8న అఖిల్6 పై అప్డేట్
ఎన్ని సినిమాలు చేసినా, ఎంత కష్టపడినా అక్కినేని అఖిల్(Akkineni Akhil) కు సరైన హిట్ మాత్రం దక్కడం లేదు. అఖిల్(Akhil) లాంటి హీరోకి సరైన సినిమా పడితే ఇప్పటికే స్టార్ హీరోగా నిలిచేవాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్(Most Eligible Bachelor) సినిమాతో ఫర్వాలేదనిపించుకున్న అఖిల్, ఆ తర్వాత సురేందర్ రెడ్డి(Surender reddy)తో కలిసి పాన్ ఇండియా స్థాయిలో ఏజెంట్(Agent) మూవీ చేశాడు.
ఏజెంట్ కోసం ఎంతో కష్టపడి, ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఆ సినిమా అందరి ఆశలపై నీళ్లు చల్లింది. టాలీవుడ్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఏజెంట్ మిగిలింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన అఖిల్ ఎలాగైనా హిట్ కొట్టాకే ఆడియన్స్ ముందుకొచ్చి మాట్లాడతానని నాగ్(Nag) తో చెప్పాడు. అయితే ఏజెంట్ వచ్చి ఇంత కాలమవుతున్నా అఖిల్ తన తర్వాతి సినిమా గురించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు.
తాజాగా అఖిల్6(Akhil6) గురించి నిర్మాత నాగవంశీ(Naga Vamsi) ట్వీట్ చేశారు. ఏప్రిల్ 8వ తేదీన అఖిల్ బర్త్ డే సందర్భంగా నాగవంశీ ఈ ట్వీట్ చేశాడు. అఖిల్ పుట్టినరోజు నాడు అఖిల్6 గురించి అనౌన్స్మెంట్ రానుందని హింట్ ఇస్తూ నాగవంశీ ఆ పోస్ట్ చేశాడు. వినరో భాగ్యము విష్ణు కథ(Vinaro Bhagyamu Vishnu Katha)డైరెక్టర్ మురళీ కృష్ణ అబ్బూరు(Murali Krishna Abburu)దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna Studios) తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments)నిర్మించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు లెనిన్(Lenin) అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 8వ తేదీన టైటిల్ తో పాటూ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసే ఛాన్సుంది.













