బీజేపీలో ఆదినారాయణరెడ్డి!
తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. అమిత్ షా సమయంలో బీజేపీ పార్టీలో చేరనున్నారు. హైదరాబాదు నుంచి తన అనుచరులతో కలిసి ఢిల్లీకి బయలు దేరి వెళ్ళారు. గత రెండు నెలలుగా ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరుతున్నట్లు చర్చలు కొనసాగాయి. అందుకు అనుగుణంగా ఆదినారాయణరెడ్డి బీజీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం. చంద్రబాబు దృష్టికి తీసుకపోయినట్లు సమాచారం. చంద్రబాబు పార్టీ మారే విషయంపై ఆదినారాణరెడ్డిని బుజ్జగించినట్లు తెలిసింది. అయితే ఆదినారాయణరెడ్డి కొన్ని రాజకీయాల పరిణామల వలన విధిలేని పరిస్థితులలో పార్టీ మార్పు చేయవలసిన పరిస్థితి ఏర్పడిందని తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి వివరించినట్లు తెలిసింది.













