టీడీపీకి 150 సీట్లు ఖాయం
రాష్ట్రంలో అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే టీడీపీని గెలిపిస్తాయని సినీ హీరో నారా రోహిత్ అన్నారు. కలవలపల్లిలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ప్రజాదరణ చూస్తుంటే 150 సీట్లు టీడీపీ గెలుస్తుందన్నారు. ప్రతి చోటా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పార్టీ గెలుపునకు చాలా ఉత్సాహంగా కష్టపడి పనిచేస్తున్నారన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్ర చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతాయన్నారు.













