ABV: ఏపీకి ఆ హక్కు ఉంది కానీ …తెలంగాణ అసత్య ప్రచారం : ఏబీవీ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కోస్తాంధ్ర నిర్లక్ష్యానికి గురైందని విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao) అన్నారు. గుంటూరులో నదీ జలాల హక్కుల పరిరక్షణ, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావుమ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ (Hyderabad) కేంద్రీకృతంగా అభివృద్ధి కోసం నిధులు ఖర్చు చేశారన్నారు. గత 40 ఏళ్లలో ఒక్క భారీ సాగునీటి ప్రాజెక్టు కూడా కోస్తాంధ్రకు రాలేదని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) నిర్మాణం దశాబ్దాలుగా జరుగుతూనే ఉందని పేర్కొన్నారు. ప్రాజెక్టు డిజైన్లు, నిర్మాణం అంతా రైతుల అవసరాల కోసమే జరగాలని చెప్పారు. మిగులు జలాలు వాడుకునే హక్కు చివరి రాష్ట్రం ఏపీకి ఉంది. ఒక బేసిన్‌నుంచి మరో బేసిన్‌కు నీరు తరలించుకోవచ్చు. ఈ విషయాలు బచావత్ ట్రైబ్యూనల్ గతంలో స్పష్టం చేసింది. కానీ తెలంగాణ (Telangana) అనవసర రాద్ధాంతం చేసి మిగులు జలాలపై అసత్య ప్రచారం చేస్తోంది. దీన్ని సాకుగా చూపి తెలంగాణ అనుమతులు లేని ప్రాజెక్టులు నిర్మిస్తోంది అని అన్నారు.