Judges : కొత్తగా బాధ్యతలు చేపట్టిన న్యాయమూర్తులకు సన్మానం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులు(Judges)గా కొత్తగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ(Hariharanath Sharma), డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు (Yadavalli Lakshmana Rao)లను హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. శాలువాలు కప్పి దేవుని చిత్రపటాలు, జ్ఞాపికలను అందజేశారు. సన్మాన గ్రహీతలు జస్టిస్ హరిహరనాథ శర్మ, జస్టిస్ లక్ష్మణరావు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ సమన్వయంతో పనిచేసి న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను పెంచుదామని అన్నారు. హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.చిదంబరం (K. Chidambaram) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు ఎన్.రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎన్.శ్రీహరి, కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.













