ఉక్రెయిన్ నుంచి ఏపీ విద్యార్థుల రాక
ఉక్రెయిన్ లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విద్యార్థులను క్షేమంగా రాష్ట్ర ప్రభుత్వం స్వస్థలాలకు చేరుస్తోంది. ఇప్పటి వరకు నాలుగు విడతలుగా మొత్తం 27 మంది విద్యార్థులు ముంబై, ఢిల్లీ విమానాశ్రయాలకు చేరుకున్నారు. ఢిల్లీ చేరుకున్న వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏపీ భవన్ అదికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రశాక్ ఆదేశాల మేరకు విమానాశ్రయంలో ఏర్పాటైన హెల్ప్ డెస్క్ సిబ్బంది విద్యార్థులు ఏపీ భవన్కు చేరుకోవడానికి సహకరించారు. స్వగ్రామాలకు చేర్చేందుకు వీరిని అక్కడి నుంచి విమానాల్లో రాష్ట్రానికి తీసుకువస్తున్నారు. ఇప్పటివరకు నాలుగు విమానాల్లో విద్యార్థులను భారత్కు తరలించగా మిగిలిన వారిని తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 507 మంది విద్యార్థులు ఉక్రెయిన్లో ఉన్నట్లు గుర్తించారు.













