మరోసారి రికార్డు సృష్టించిన ముంబయి ఎయిర్ పోర్ట్
ఆర్థిక రాజధాని ముంబయిలోని అంతర్జాతీయ విమానాశ్రయం తన రికార్డును మరోసారి అధిగమించింది. ఒక్కరోజులోనే 1000 విమానాల రాకతో గతంలో ఉన్న రికార్డును తిరగరాసింది. ఒకే ఒక్క రన్‌వేను కలిగి ఉన్న అత్యంత రద్దీ అయిన విమానాశ్రయంగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన ముంబయి విమానాశ్రయం మరో అరుదైన రికార్డును సృష్టించింది. ఈ నెల 6వ తేదీన ఒక్కరోజే ముంబయి విమానాశ్రయానికి దాదాపు 1003 విమానాలు రాకపోకలు సాగించాయి. దీంతో గతంలో ఉన్న రికార్డును బద్ధలు కొట్టినట్లుయింది. ఈ విషయాన్ని ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్స్ (ఎంఐఏఎల్) అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.













