అత్యంత సంపన్నుడు మళ్లీ ముఖేశ్
రిలయన్స్ సంస్థల అధినేత ముఖేశ్ అంబానీ దేశంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా అగ్రస్థానంలో నిలిచారు. దేశంలోని కుబేరుల జాబితాను ఐఐఎఫ్ఎల్ వెల్త్ హూరన్ విడుదల చేసిది. ఈ జాబితాలో రూ.3,80,700 కోట్లతో వరుసగా ఎనిమిదవ సారి ముఖేశ్ అంబానీ దేశంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. 1,86,500 కోట్లతో హిందూజా కుంటుంబం రెండవ స్థానంలో నిలువగా విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్జీ మూడవ స్థానంలో ఉన్నారు. అజీమ్ ప్రేమ్జీ ఆస్తుల విలువ రూ.1,17,100 కోట్లు. గత సంవత్సరంతో పోల్చితే మన దేశంలో కుబేరుల సంఖ్య పెరిగినట్లు ఐఐఎఫ్ఎల్ వెల్త్ హూరన్ తన నివేదికలో తెలియజేసింది. ఈ రూ.1000 కోట్ల కంటే ఎక్కువ సంపద కలిగిన వారు 2018లో 831 మంది ఉంటే ఇప్పుడు వారి సంఖ్య 953కు పెరిగినట్లు వెల్లడించింది. కాగా, మొదటి 25 మంది కుబేరుల వద్ద ఉన్న సంపద విలువ దేశ జీడీపీలో 10 శాతానికి సమానమని తెలిపిన ఐఐఎఫ్ఎల్ మొత్తం 953 మంది వద్ద ఉన్న సంపద విలువ దేశ జీడిపిలో 27 శాతానికి సమానమని వెల్లడించింది.













