మిమ్మల్ని సీఎంగా చూడాలనుకుంటున్నాను
డీఎంకే కార్వనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నానని ప్రముఖ నటుడు మోహన్‌బాబు తన మనసులో మాట చెప్పారు. కోయంబత్తూర్‌లో జరిగిన మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సంస్మరణ సభకు మోహన్‌బాబు హాజరయ్యారు. కరుణానిధి సంస్మరణ సభకు నన్ను ఆహ్వనించిన సోదరుడు ఎంకే స్టాలిన్‌కు ధన్యవాదాలు. మీకు అంతా మంచే జరుగాలని కోరుకుంటున్నా. మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నానని ట్వీట్ చేశాడు మోహన్‌బాబు. ఎంకే స్టాలిన్ డీఎంకే పార్టీ అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.













