న్యూయ్కార్ ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన ఉగ్రదాడిపై భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. న్యూయార్క్‌లో ఉగ్రదాడి ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అమెరికాకు భారత్ అండగా ఉంటుంది అని రాష్ట్రపతి అన్నారు. న్యూయార్క్‌లో ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఘటన నుంచి బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్దిస్తున్నా అని మోదీ ట్వీటర్ ద్వారా సానూభూతి ప్రకటించారు. న్యూయార్క్‌లోని డబ్ల్యూటీసీ వద్ద ఓ దుండగుడు ట్రక్కుతో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో 8 మంది మృతిచెందగా, మరో 11 మంది గాయపడ్డారు. నిందితుడు సైపుల్లో సైపోవ్‌గా గుర్తించారు. ఘటనకు పాల్పడింది ఐసిస్ అయ్యి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.













