తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఎమ్మెల్సీల ఎన్నికకు ఈ నెల 21న నోటిఫికేషన్ విడుదల చేసి.. మార్చి 12న పోలింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణలో 5, ఆంధ్రప్రదేశ్ 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలుకు ఈనెల 28 చివరి తేదీగా నిర్ణయించారు. మార్చి 1న నామినేషన్ల పరిశీలన జరగనుండగా, ఉపసంహరణకు మార్చి 5 గడువుగా ఈసీ పేర్కొంది. మార్చి 12న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరక పోలింగ్ నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు. మార్చి 15 నాటికి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది.













