రాష్ట్రపతి రేసులో సుమిత్రా మహాజన్
భారత రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ మొదలైంది. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో రాజకీయ పార్టీలు ఎన్నికలకు సన్నద్దం కావాల్సిన సమయం ఆసన్నమైంది. అధికార ఎన్డీయే కూటమి ప్రతిపక్షాలతో ఏకాభిప్రాయ చర్చలకు శ్రీకారం చుట్టింది. ఎన్డీయే తరపున లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తెరమీదికొచ్చారు. లోక్సభ స్పీకర్గా ఆమె వ్యవహార శైలి పట్ల కాంగ్రెస్ దగ్గర్నుంచి ఇతర ప్రతిపక్షాలకు ఎలాంటి అభ్యంతరాలు ఈ మూడేళ్లలో రానందున రాష్ట్రపతిగా ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తే ఉమ్మడి ప్రతిపక్షాలు తమ అభ్యర్థిని పోటీకి నిలుపక పోవచ్చునని ప్రధాని మోడీ అభిప్రాయపడుతున్నట్టు తాజా సమాచారం. అయితే అధికార పక్షం నుంచి ఇంతవరకు ఎలాంటి సంకేతాలు వెలువడలేదు. ఎన్డీయే కూటమి వ్యూహాన్ని బట్టి తాము నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షం ఎదురుచూస్తున్నది. మొత్తానికి ఈనెల 23న ఎన్డీయే అభ్యర్థి నామినేషన్ వేస్తారనీ ఎన్డీయే వర్గాలు వెల్లడించాయి.













