కావేరి పుష్కరాల సందర్భంగా పవిత్ర శ్రీరంగం (తమిళనాడు) లో స్నానం చేసేందుకు వెళ్ళడానికి సిద్ధ పడుతున్నారా….?
అయితే ఆలోచించాలసిందే…. అక్కడ కావేరి గర్భం వట్టిపోయి…. అక్కడక్కడా ఏర్పడిన గుంతలలోకి చేరిన పట్టణం నుండి విసర్జింపబడిన మురుగు నీరే కనిపిస్తుందట…. దానినే పవిత్ర గంగాజలంగా భావించి ఆ మురుగులో మునక వెయ్యాలనుకునే వారు మాత్రం వెళ్ళవచ్చు. కావేరిలో శ్రీరంగంలో స్నానం చేస్తే కొరికలు నెరవేరతాయన్న ఆశతో మంగళవారం ఉదయం అక్కడకు చేరిన ఆశావాహులకు ఆరిపోయిన కావేరి…. గంతల్లో అక్కడక్కడా మురుగు నీరు దర్శనం ఇవ్వడం తో వారు కలవర పడిపోయారట….. పాపం ఆ మురుగు నీటిలో స్నానం చేయలేక వేరే ప్రాంతానికి పయన మయ్యారట …ఈ .విడియో . పస్తుతం సామాజికమాద్యమాలలో తిరుగాడుతుంది.













