అవసరమైతే బీజీపీతో కలుస్తా
సొంతగా రాజకీయ పార్టీని స్థాపిస్తానని ఇటీవల వెల్లడించిన కమల్ హాసన్ తాజాగా అవసరమైతే బీజేపీలో చేతులు కలిపేందుకు సిద్ధమని ప్రకటించారు. ప్రజా ప్రయోజనాలే తనకు అంతిమ లక్ష్యమని సృష్టం చేశారు. రాజకీయాల్లో అంటరానితనానికి తావులేదని అన్నారు. నాస్తికవాదినైన తనకు, ఆధ్యాత్మిక భావాలు మెండుగా ఉన్న బీజేపీకి మధ్య పొత్తు కుదరదని భావించడం పొరపాటని అన్నారు. అవినీతి అనేది ఏ ఒక్క వ్యక్తివల్లో పెంచి పోషించబడడం లేదన్నారు. ఓటుకు రూ.5000 చొప్పున తీసుకుంటున్న వ్యక్తి దగ్గరే అవినీతి మొదలవుతోందని అభిప్రాయంగా వెల్లడించారు.













