కువైత్‌లో రాయబారిగా జీవసాగర్
కువైత్‌లో భారత రాయబారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కె.జీవసాగర్(57) నియమితులయ్యారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన జీవసాగర్ 1991లో అఖిల భారత సర్వీసుకు ఎంపికయ్యారు. ఇరానీ భాష ఫార్సీలో ప్రావీణ్యం పొంది ఇరాన్లో దౌత్యవేత్తగా ఉద్యోగం ప్రారంభించారు. ఆఫ్రికా, యూరప్, ఆసియా దేశాలతో పాటు కీలకమైన పాకిస్థాన్ వ్యవహారాల విభాగం అథిపతిగానూ పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధ్యర్యంలో అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలు నిర్వహించే విభాగానికి అధిపతిగా వ్యవహరిస్తున్నారు. కువైత్‌కు వచ్చి రాజు షేక్ సభాను కలుస్తారు.













