డ్రగ్స్ రవాణా, తీసుకోవడాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది
14కు పైగా నిషేధిత మాదకద్రవ్యాలు దేశంలోకి దిగుమతి కాకుండా :చట్టం చేసింది. లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల నుంచి ప్రపంచదేశాలకు డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. వీటిపై ఇప్పటికే పలు దేశాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. కొన్నిదేశాల్లో బహిరంగ మరణశిక్ష అమలవుతోంది. డ్రగ్స్‌తో దొరికితే కాల్చిపారేస్తున్నారు. మన దేశంలోకి గోవా, గువాహటి, ముంబయి, చెన్నై, కోల్‌కతా, గుజరాత్ సరిహద్దుల మీదుగా మాదకద్రవ్యాలు సరఫరా అవుతున్నాయి. ఇందుకు పెద్ద నెట్వర్కే నడుతోంది. ఈ మాఫియా పీచమణిచేందుకు ప్రభుత్వం నార్కొటిక్స్చట్టంలో సవరణలు తీసుకొచ్చింది.













