భారత్‌లో హార్లే డేవిడ్ సన్ యూనివర్సిటీ
అమెరికన్ బైక్‌ల కంపెనీ హార్లే డేవిడ్సన్ భారత్‌లో తన హార్లే డేవిడ్సన్ యునవర్సిటీని ఏర్పాటు చేయాలనుకుంటోంది. ఢిల్లీలో ఏర్పాటు చేసే ఈ యూనివర్సిటీ ద్వారా సంస్థ ఉద్యోగులు, డీలర్షిప్ సిబ్బందికి శిక్షణను ఇవ్వనుంది. టెక్నికల్ శిక్షణతోపాటు ఫైనాన్స్, బ్రాండింగ్‌కు సంబంధించిన కోర్సులను కూడా ఈ యూనివర్సిటీ ద్వారా ఆఫర్ చేయనున్నారు. ఆసియా పసిఫిక్ రీజియన్‌లో ఇలాంటి మూడు యూనివర్సిటీలను హార్లే డేవిడ్సన్ నిర్వహిస్తోంది. భారత్‌లో తన బైక్‌ల విక్రయలు భారీగా పెరుగుతున్న కారణంగా ఇక్కడ కూడా ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి కంపెనీ వచ్చింది.













