ఎస్బీఐ కస్టమర్లకు శుభవార్త!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు కాస్త ఊరట కలిగించే వార్త ఇది. సేవింగ్స్ అకౌంట్లలో ఉంచాల్సిన మినిమమ్ బ్యాలెన్స్ మొత్తాన్ని తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అర్బన్ ఏరియాలో ఇది రూ.3 వేలు, సెమీ అర్బన్‌లలో రూ.2వేలు, రూరల్ ఏరియల్లో రూ.వెయ్యిగా ఉంది. ఎస్బీఐ ఆరేళ్ల తర్వాత గతేడాది ఏప్రిల్ నుంచి మళ్లీ మినిమమ్ బ్యాలెన్స్ చార్జ్‌లను వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. కనీస మొత్తం అకౌంట్లలో లేకపోతే రూ.100తో పాటు జీఎస్టీ వసూలు చేస్తున్నది. దీని ద్వారా ఎస్బీఐ బాగానే ఆర్జించింది. రూ.1771 కోట్లు ఎస్బీఐ ఇలా చార్జీల రూపంలో వసూలు చేసినట్లు ఆర్థిక శాఖ నివేదిక సృష్టం చేసింది. ఇది ఆ బ్యాంక్ రెండో త్రైమాసికంలో ఆర్జించిన లాభాల కంటే ఎక్కువ కావడం గమనార్హం. దీనిపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. దీంతో ఎస్బీఐ కనీస మొత్తాలను తగ్గించే ఆలోచన చేస్తున్నది.













