హైదరాబాద్ నుంచి గో ఎయిర్ కొత్త సర్వీసులు
గో ఎయిర్ హైదరాబాద్ నుంచి వివిధ గమ్యాలకు కొత్త సర్వీసులు ప్రారంభిస్తోంది. ముంబై, ఢిల్లీ నుంచి మరిన్ని అంతర్జాతీయ గమ్యాలకు కూడా సర్వీసులను ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ప్రకటించిన కొత్త సర్వీసుల్లో కొచ్చిన్ (రూ.3,240), చెన్నై (రూ.1,724), జైపూర్ (రూ.2,343), బెంగళూరు (రూ.1,811), చండీగఢ్ (రూ.4,250), పట్నా (రూ.3,295) ఉన్నాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ప్రస్తుతం నడుస్తున్న సర్వీసులకు మరో రెండు జోడించడంతో ఉదయం బయలుదేరి రాత్రికి తిరిగి వచ్చే అవకాశం ప్రయాణికులకు ఏర్పడుతుందని కంపెనీ తెలిపింది.













