పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం సహకరించాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలని కేంద్ర ప్రభుత్వానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమావేశమయ్యారు. గోదావరి, పెన్నా నదులను కావేరితో అనుసంధానం చేయాలని వెంకయ్య అన్నారు. ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ, తమిళనాడులో కరువు ప్రాంతాలకు సాగు, తాగు నీరందించాలని ఉప రాష్ట్రపతి చెప్పారు. నదుల అనుసంధానికి రూ.3వేల కోట్లు విడుదల చేయాలని వెంకయ్య విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై ఆర్థికశాఖతో చర్చిస్తామని మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు.













