తమిళనాడులో ఒక్కరోజే 17 కొత్త కేసులు
భారతదేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 1,190 కి పెరిగింది. వారిలో ఇప్పటివరకు 98 మంది డిశ్చార్జ్ అయ్యారు. సోమవారం ఒక్కరోజే తమిళనాడులో 17 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా పశ్చిమబెంగాల్, గుజరాత్‌లలో ఈ మహమ్మారితో ఇద్దరు మృతి చెందారు. దీంతో భారత్‌లో కరోనా మరణాల సంఖ్య 32కి చేరింది. ఈ వైరస్ కారణంగా మరణించిన వారిలో అత్యధికంగా మహారాష్ట్ర 6, గుజరాత్ లో 6 నమోదు కాగా, కర్ణాటక 3, మధ్యప్రదేశ్ 2, ఢిల్లీ 2, పశ్చిమ బెంగాల్ 2, జమ్మూకశ్మీర్ 2 మృత్యువాత పడ్డారు. ఇక కేరళ, తమిళనాడు, తెలంగాణ, బీహార్, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో ఒకరు చొప్పున ప్రాణాలు విడిచారు.
దేశంలో కరోనా కేసుల సంఖ్య అత్యధికంగా మహారాష్ట్రలో 215 నమోదు కాగా.. కేరళలో 202 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో ఇప్పటిరకు 83 కేసులు, తెలంగాణలో 70, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో 72 కేసులు, గుజరాత్లో 69, రాజస్తాన్‌లో 60 కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో సోమవారం ఒక్కరోజే 17 కొత్త కేసులు నమోదవ్వడంతో ఆ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 67కి చేరింది.













