చంద్రబాబు నా హీరో : కమల్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన హీరో అని హీరో కమ్ పొలిటీషియన్ కమల్ హాసన్ అన్నారు. కమల్ తన రాజకీయ యాత్ర ప్రారంభించారు. తొలుత రామేశ్వరం చేరుకున్న ఆయన అక్కడ మత్స్యకారులతో సమావేశమై వారి సమస్యలను విన్నారు. అనంతరం స్థానికంగా ఉన్న ఓ హోటల్లో మీడియాతో మాట్లాడారు. తాను మహాత్మాగాంధీకి వీరాభిమానని అన్నారు. మంగళవారం రాత్రి చంద్రబాబు నాకు ఫోన్ చేశారు. ప్రజలకు ఏం చేయాలి అన్న విషయాల గురించి సలహాలు ఇచ్చారు. రాజకీయ యాత్రలో భాగంగా కర్యకర్తలు, అభిమానులు నన్ను కలవడానికి వచ్చిన శాలువాలు కప్పుతున్నారు. ఇంకెప్పుడూ ఇలా నాను శాలువాలు కప్పవద్దు. నేను మీ శాలువాగా మారి మీకు రక్షణ కల్పిస్తాను అని అన్నారు.
రామేశ్వరంలో కలాం చదివిన పాఠశాలకు వెళ్లాలనుకున్నాను. కానీ పాఠశాల యాజమాన్యం నాకు అనుమతి ఇవ్వలేదు. పాఠశాలకు రానివ్వకుండా అడ్డుకోగలిగారు కానీ నేను నేర్చకోవాలనుకున్న విషయాలను మాత్రం అడ్డుకోలేరు. తమిళనాడు ప్రజల గుండెల్లో నేనున్నాను. ఇప్పుడు వారి ఇళ్లల్లోనూ ఉండాలనుకుంటున్నాను. సినిమాలకు, రాజకీయాలకు పెద్ద తేడా లేదు. రెండు రంగాలు ప్రజల కోసమే. కానీ సినిమాల కంటే రాజకీయాల్లో బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్న డబ్బంతా ప్రజలదే. కలాం చనిపోయినప్పుడు ఆయన అంత్యక్రియలకు ఎందుకు రాలేదు అని చాలా మంది అడుగుతున్నారు. సాధారణంగా నేను అంత్యక్రియలకు హాజరుకాను అని అన్నారు.













