మమతా బెనర్జీతో సీఎం చంద్రబాబు భేటీ
జాతీయస్థాయిలో విపక్షపార్టీలతోనూ కాంగ్రెస్ పార్టీతో ఉన్న విభేదాలు మరిచి కూటమిగా ఏర్పాటై బీజేపీని గద్దెదించడమే లక్ష్యంగా మూడవ కూటమిగా ఏర్పాటు కావడం తప్పదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అయిన సందర్భంగా పేర్కొన్నారు. చంద్రబాబు మమతా బెనర్జీతో సమావేశమై బిజేపీని గద్దెదించడానికి బిజేపేతర పార్టీలన్నీ ఏకం కావాలని బిజేపికి వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని విపక్షాలన్నీ ఏకమై ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు సమయం ఆసన్నమైందని మమతాతో చంద్రబాబు పేర్కొనట్లు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా బిజేపీ పాలనపై తీవ్రప్రజావ్యతిరేకత ఏర్పడిందని బీజేపీ పాలనలో దేశానికి అన్ని కష్టాలేనని జాతీయస్థాయిలో ప్రజలు బాగా గుర్తించారని జిఎస్టీ అమలుచేయడం, పెద్దనోట్ల రద్దు, ఏటీఎంలో విత్డ్రావల్స్పై పరిమితులుండడం, ఎరువులు, పెట్రోల్, డిజిల్ రేట్లను పెంచి బీజేపీ పాలన ప్రజలకు గుదిబండగా మారిందని దేశంలో సాధారణ పౌరులు సైతం ప్రశాంతంగా లేరని మమతా బెనర్జితో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే అంశంపై చర్చ మొదలై మూడవ కూటమితో మమతా బెనర్జీ కీలకబాధ్యతలు అప్పజెప్పెందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు మమతా బెనర్జీని కోరినట్లు తెలుస్తోంది.













