ఆ వెబ్సైట్లను బ్లాక్ చేయండి
తమిళ్ రాకర్స్, ఈజెడ్ టీవీ, కట్మూవీస్, లైమ్ టొరెంట్స్ వంటి సైట్లను తాత్కాలికంగా బ్లాక్ చేయమని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అమెరికాకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్.. తమ నిర్మాణ సంస్థ నుంచి వెలువడిన చిత్రాలను, వెబ్ సిరీస్లను అనధికారికంగా తమిళ్ రాకర్స్ వంటి ప్రైవేటు వెబ్సైట్స్ వీక్షకులకు ఉచితంగా అందిస్తున్నాయి అని హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. పిటిషన్ను స్వీకరించి వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి సంజీవ్ నారులా.. అటువంటి వెబ్సైట్లకు నెటిజన్స్ ప్రవేశించకుండా వాటి యూఆర్ఎల్స్, ఐపీ అడ్రెస్లను బ్లాక్ చేయవలసిందిగా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను కోరారు.













