ఘనంగా సీఎం రమేష్ కుమారుడి వివాహ రిసెప్షన్
బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తనయుడు రిత్విక్ వివాహానంతర వేడుక (రిసెప్షన్) ఢిల్లీ లోని తాజ్ పేస్, దర్బార్ హాలు లో అత్యంత వైభంగా జరిగింది. ఈ వేడుకకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, ధర్మేంద్రప్రధాన్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, రవి శంకర్ ప్రసాద్, జైశంకర్, కిషన్‌రెడ్డి, వీకే సింగ్, కిరణ్ రిజిజు, హర్దీప్ సింగ్ పూరి తదితరులు నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎంపీలందరూ దాదాపుగా హాజరయ్యారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా క్ష్మీనారాయణ, మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.













